Sunday, February 23, 2025
HomeతెలంగాణCM Revanth: ఎస్.ఎల్.బి.సి ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్

CM Revanth: ఎస్.ఎల్.బి.సి ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్

సహాయక చర్యలు..

ఎస్ ఎల్ బీసీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండీ పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడారు.

- Advertisement -

మంత్రుల పర్యవేక్షణలో సహాయక చర్యలు

సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెండోరోజు నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండీ పర్యవేక్షించారు.

రంగంలోకి ఆర్మీ, నేవీ

ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

ఫ్లోటింగ్ వాటర్ తో ఆటంకం

వాటర్ ఫ్లోటింగ్ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయటంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. టన్నెల్ లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్నామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News