Saturday, October 12, 2024
HomeతెలంగాణCM Revanth tribute to Gandhi and Lal Bahadur Sastri: గాంధీ లాల్...

CM Revanth tribute to Gandhi and Lal Bahadur Sastri: గాంధీ లాల్ బహదూర్ శాస్త్రికి సీఎం రేవంత్ నివాళి

‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం ద్వారా రైతులు, సైనికుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఔన్నత్యాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. అక్టోబర్ 2న శాస్త్రి జయంతిని పురస్కరించుకుని స్వతంత్ర భారత రెండవ ప్రధానమంత్రిగా దేశానికి అందించిన సేవలను రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఆయన నిరాడంబరత గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. రాజకీయ నేతల్లో అరుదైన వ్యక్తిగా , దేశాన్ని అమితంగా ప్రేమించే నాయకుడిగా కీర్తిగడించారని సీఎం అభిప్రాయపడ్డారు. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన గొప్ప నాయకుల్లో శాస్త్రి ఒక్కరని అన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

బాపూఘాట్ లో ఘన నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News