Sunday, January 5, 2025
HomeతెలంగాణCMR College: సీఎంఆర్ కాలేజ్ ఘటన.. విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్

CMR College: సీఎంఆర్ కాలేజ్ ఘటన.. విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్

మేడ్చల్ సీఎంఆర్(CMR) ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్(Women Commission) సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. మహిళా కాలేజీ హాస్టల్లో బాత్రూంలోని దృశ్యాలను చిత్రీకరించిన అంశంపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆదేశించారు.

- Advertisement -

మరోవైపు హాస్టల్ వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఆమె ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినిలు బుధవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్టల్ బాత్రూమ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టారంటూ స్టూడెంట్స్ ఆరోపించారు. తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకునిరి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టామన్నారు. బాత్‌రూమ్‌ల కిటికీల వద్ద ఫింగర్‌ప్రింట్లు సేకరించి టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హాస్టల్ సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారని.. వారి మొబైల్ ఫోన్లు పరిశీలించి ఎలాంటి రికార్డింగ్‌లు ఉన్నాయో తెలుసుకుంటామమన్నారు. ఆరోపణలు నిజమైతే మాత్రం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News