“మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించటం ఎలా – UPSC మాస్టర్ క్లాస్” అనే అంశం పై మేడ్చల్ లోని CMR ఇంజినీరింగ్ కళాశాలలో G5 మీడియా గ్రూప్, హైదరాబాద్ లోని 21st సెంచరీ IAS అకాడమీ సంయుక్తంగా నిర్వహించారు.
ఫ్యూచర్ లీడర్స్ ను తయారు చేయటమే టార్గెట్..
21st సెంచరీ IAS అకాడమీ ఛైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “మీరు ఎదగడమే కాకుండా, ఇతరులు మీ గురించి తెలుసుకునే విధంగా ఎదగాలి “ అని చెబుతూ , అందుకోసం UPSCలో సీటు సాధించాలని చెప్పారు. ఐపీఎస్ ఆఫీసర్ అజిత్ దోవల్ వంటి వారు సివిల్స్ రాసే అభ్యర్థులకు మంచి ప్రేరణ అని సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు ఆయన వివరించారు. తన అకాడమీ లక్ష్యం భవిష్యత్ తరానికి నాయకులను సృష్టించడం, వారికి అవసరమైన శిక్షణ అందించడమేనని కృష్ణ ప్రదీప్ అన్నారు.
కష్టమనే ఫీలింగ్ వదిలిపెట్టండి..
21st సెంచరీ IAS అకాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ UPSC పరీక్షల్లో ప్రాథమిక తరగతుల ప్రశ్నలూ కూడా వస్తాయని, అందులోని ప్రశ్నలన్నీ చాలా కఠినమైనవన్న భావనను వీడాలని చెప్పారు. అలాగే, కేవలం 35% మార్కులతో ఉత్తీర్ణత పొందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ పరీక్షలకు అర్హులు అని స్పష్టంగా పేర్కొన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే UPSC లో సీటు సంపాదించడం తేలిక అన్నారు.
CMREC సెక్రటరీ శ్రీశైలం రెడ్డి , ప్రిన్సిపాల్ డాక్టర్ AS రెడ్డి, డాక్టర్ లక్ష్మయ్య, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ హెడ్ డాక్టర్ విజయ్ కార్తిక్ , G5 మీడియా డైరెక్టర్ IN గిరి ప్రకాష్ సెమినార్ లో పాల్గొని సివిల్స్ పైన విద్యార్థులందరికీ అవగాహన పెంపొందించే ప్రయత్నం చేశారు.
కాలేజ్ లో సివిల్ సర్వీస్ క్లబ్ కూడా..
సెక్రటరీ శ్రీశైలం రెడ్డి మాట్లాడుతూ, CMR కాలేజ్ లో సివిల్స్ సర్వీస్ క్లబ్ ఏర్పాటు చేసి, రాబోయే రోజులో తమ కాలేజ్ నుండి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ లను చేయడానికి కృషి చేస్తామని, అలాగే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుండి తగిన విధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామని” తెలిపారు.