Saturday, November 15, 2025
HomeతెలంగాణViral news:మండి బిర్యానీలో బొద్దింక..సోషల్‌ మీడియాలో వైరల్!

Viral news:మండి బిర్యానీలో బొద్దింక..సోషల్‌ మీడియాలో వైరల్!

Cockroach Found In Mandi: హైదరాబాద్ అంటే చాలా మందికి మొదట గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఇక్కడి బిర్యానీ రుచిని ఆస్వాదించేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా, విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అయితే, ఈ బిర్యానీ కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌లోనే ఇటీవల ఒక సంఘటన కలకలం రేపింది. బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్లకు అందులో బొద్దింక రావడంతో పెద్ద వివాదం తలెత్తింది.

- Advertisement -

అరేబియన్ మండి రెస్టారెంట్‌..

ఈ ఘటన ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్‌లో జరిగింది. సాధారణంగా స్నేహితులు కలసి హోటళ్లకు వెళ్లి భోజనం చేస్తారు. అలానే కొంతమంది యువకులు ఆ రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. వేటర్ ఆర్డర్ తీసుకొచ్చి టేబుల్‌పై పెట్టగానే, వారు తినడం ప్రారంభించారు. కొద్దిసేపటికి ప్లేట్‌లో బొద్దింక కనబడటంతో అందరూ షాక్‌ అయ్యారు.

బొద్దింకలు రావడమే…

తమకు తినడానికి ఇచ్చిన ఆహారంలో బొద్దింకలు రావడమే కాకుండా, నిర్వాహకులు చూపిన వైఖరి కస్టమర్లకు మరింత కోపం తెప్పించిందని తెలుస్తుంది. కస్టమర్లు ప్రశ్నించగానే హోటల్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారట. పైగా, కస్టమర్లనే బయటకు వెళ్లమంటూ ఫోర్స్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెస్టారెంట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read: https://teluguprabha.net/telangana-news/telangana_weather_report_rains_today_yesterday/

ఆగ్రహంతో వారు అక్కడికక్కడే నిరసన చేపట్టారు. పోలీసులు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కస్టమర్లను సముదాయిస్తూ, రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్‌..

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. చాలా మంది ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హోటళ్లలో శుభ్రత, నాణ్యతపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad