Saturday, November 23, 2024
HomeతెలంగాణCollector Ila Tripathi: ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 నింపాల్సిందే

Collector Ila Tripathi: ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 నింపాల్సిందే

వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి ఎన్నికల్లో ఓటు కోసం

రానున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ, జిల్లాలకు జరిగే శాసన మండలి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హత కలిగిన వారు ఫిబ్రవరి 6వ తేదీ లోగా పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
నవంబర్ 1, 2020 నాటికి డిగ్రి ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులు అర్హులని, గతంలో పట్టభద్ర ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకున్నప్పటికి తిరిగి మరల నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని పట్టభద్రులు, విద్యార్థిని, విద్యార్ధులు, వివిధ ప్రభత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు నమోదు చేసుకోవాలని, ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 ద్వారా (ఆన్ లైన్) లేదా సంబంధిత తహసిల్దార్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చుని సూచించారు.
జిల్లాలో గత ఎమ్మెల్సీ 2021 ఎన్నికల సందర్బంగా 10323 మంది పట్టభద్రులు నమోదు చేసుకోగా, ఇప్పటి వరకు కేవలం 824 మాత్రమే నమోదు చేసుకున్నారని, ఫిబ్రవరి 6వ తేదీ లోగా జిల్లాలోని పట్టభద్రులు నమోదు చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఫారం 18 ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 24న డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన చేసి మార్చి 14 లోపు డ్రాఫ్ట్ ఓటరు జాబితా పై అభ్యంతరాల స్వీకరిస్తామని, మార్చి 29 లోపు సదరు అభ్యంతరాలను పరిష్కరించి ఏప్రిల్ 4న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News