Sunday, October 6, 2024
HomeతెలంగాణCollector Ravi: పండుగలా తెలంగాణకు హరితోత్సవం

Collector Ravi: పండుగలా తెలంగాణకు హరితోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 19 నిర్వహించనున్న తెలంగాణకు హరితోత్సవం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. హరితోత్సవం, విద్యా దినోత్సవం, ఆధ్యాత్మిక దినోత్సవ నిర్వహణ విషయమై ఆదివారం ఆయన జిల్లా స్థాయి సంబంధిత అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గతంలో హరితహారం కిందనాటిన మొక్కలపై దృష్టి సారిస్తూ అన్ని గ్రామాలు, సంస్థలు అన్నిచోట్ల మొక్కలు నాటాలన్నారు. ముఖ్యంగా హరితహారం కింద ఈ సీజన్లో మొక్కలు నాతెందుకు గుర్తించినచోట వెంటనే గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రామాలు, పట్టణాలలో ప్రకృతి వనాలలో తోరణాలతో అలంకరించాలని, పండగ వాతావరణం లో కార్యక్రమం నిర్వహించాలన్నారు. దశాబ్ది వనాలలో గుంతలు తీసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు.

- Advertisement -

ఈ నెల 20 న నిర్వహించనున్న విద్యా దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి మొదలుకొని విశ్వవిద్యాలయం వరకు అన్ని చోట్ల కార్యక్రమాలను నిర్వహించాలని ,అన్ని పాఠశాలల్లో రాగిజావ పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని, పిల్లల యూనిఫామ్, బుక్కులు, ట్యాగులు, లైబ్రరీ బుక్కులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, మన ఊరు- మనబడి కింద ఎక్కడైనా పాఠశాల పూర్తయినట్లయితే ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని ,మధ్యాహ్న భోజన పథకంలో ఒక స్వీట్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.

ఈ నెల 21 న నిర్వహించే ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా జిల్లాలో 113 దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయని, దేవాలయాలతో పాటు, చర్చిలు, గురుద్వారాలు అన్నింటిలో ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించాలన్నారు. అన్ని దేవాలయాలు విద్యుత్ దీప కాంతులతో పాటు, పూలతో అలంకరించాలని ,వేద పారాయణం, హోమం, ప్రసాద వితరణ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు .సంబంధిత శాసనసభ్యులతో మాట్లాడి కార్యక్రమాలను ప్రారంభించాలని ,అదేవిధంగా దేవాలయాల పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఈ విషయాన్ని చెప్పాలని తెలిపారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ,డిఎఫ్ఓ సత్యనారాయణ, డీఈవో రవీందర్, డిపిఓ వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా శాఖల అధికారులు ,మండల స్థాయి అధికారులు ,గ్రామపంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News