Telangana BC Reservations : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీలకు న్యాయం కావాలంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం రావాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ముఖేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ధర్నా సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
ఇండియా కూటమిలో భాగమైన డీఎంకే, వామపక్షాలు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు సంఘీభావం ప్రకటించనున్నాయి. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, “రిజర్వేషన్లకు పరిమితి చెప్పడం అన్యాయం. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు ఉంది” అన్నారు. ఈ ధర్నా, బీసీ హక్కుల కోసం సాగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా స్పందన తెచ్చుకుంటోంది.
ALSO READ : Chandrababu Naidu: డబ్బుతో పనిలేదు.. స్పందిస్తే అదే పదివేలు!!


