అటవీ ప్రాంతంలో నివసించే విద్యార్థుల కోసం తెలంగాణలోని ములుగు జిల్లాలో మంత్రి సీతక్క(Seethakka) కంటైనర్ స్కూల్(Container School) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సూళ్ల ఏర్పాటును కాంగ్రెస్ అధిష్టానం మెచ్చుకుంది. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఆటంకాలను అధిగమించి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం అని పేర్కొంది. రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగుతూ ప్రజా పాలన అందించాలని ఆకాంక్షించింది. ఈ వీడియోను సీతక్క రీట్వీట్ చేస్తూ “దేశానికి రోల్ మోడల్ గా ములుగు కంటైనర్ పాఠశాల” అంటూ రాసుకొచ్చారు.
కాగా ములుగు జిల్లాలో గతేడాది తొలి కంటైనర్ స్కూల్ (Minister Seethakka) మంత్రి సీతక్క ప్రారంభించిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతం అయిన బంగారుపల్లి గ్రామంలో రూ.13 లక్షలతో మంత్రి సీతక్క చొరవ, కలెక్టర్ దివాకర్ ఆలోచనతో కంటైనర్ స్కూల్ ఏర్పడింది. అటవీ ప్రాంతం కావడంలో పాఠశాల నిర్మాణానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడటంతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు.