Thursday, April 3, 2025
HomeతెలంగాణCongress: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖపై కాంగ్రెస్ కౌంటర్

Congress: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖపై కాంగ్రెస్ కౌంటర్

Congress| ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై తాజాగా కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాని దద్దమ్మలు కూడా తమకు నీతులు చెబుతున్నారకని మండిపడ్డారు.

- Advertisement -

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) మాట్లాడుతూ రాహుల్ గాంధీకి లేఖ రాయడం కాదని ముందు ఫామ్ హౌస్‌లో పడుకున్న మీ నాన్న కేసీఆర్‌(KCR)ను అసెంబ్లీకి తీసుకురావాలని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చే బాధ్యత తమపై ఉందన్నారు. ఇప్పటికే అనేక హామీలను నెరవేర్చామమని మిగిలిన హామీలు కూడా నెరవేరుస్తామని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిరోజు కేటీఆర్, హరీశ్ రావు ఓర్వలేక ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబంలో ఆధిప్యత పోరు తేల్చుకోలేక తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ప్రతిపక్ష పాత్ర పోషించడం చేత కావడం లేదని అందుకే తన పేటీఎం రైటర్లు రాసిన లేఖను రాహుల్ గాంధీకి పంపించారని సెటైర్లు వేశారు. ఎంత పెద్ద లేఖలు రాసినా, మీ వాట్సాప్ యూనివర్సిటీలో మార్ఫింగ్ ఫోటోలతో ఎంత విద్వేషం రక్తికట్టించాలని చూసినా ప్రజలు మోసపోరన్నారు.ఇకనైనా పిచ్చి పిచ్చి రాతలు, మాటలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News