Congress Meeting at Gandhi Bhavan: హైదరాబాద్‌లో గల గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు ఇవాళ భేటీ కానున్నారు. దీంతో ఆ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన.. ఈ విస్తృత సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొనున్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించబోతుంది. దీంతో ఆ మీటింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లపై ఈ భేటీలో చర్చించబోతున్నట్లు సమాచారం. 15న నిర్వహించే కామారెడ్డిలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత ఖర్గేతో పాటుగా, కీలక నేత రాహుల్ గాంధీని ఆహ్వానించే యోచనలో ఉన్నారు. అలాగే.. భారీ జనసమీకరణ కోసం చేయాల్సిన కసరత్తుపై సైతం చర్చించనున్నారు. కామారెడ్డి సభకు సంబంధించి పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. అలాగే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై సైతం కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు.
అందుకే రాహుల్ గాంధీకి ఆహ్వానం: 2023 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల ముందు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. దీనికై ఎన్నికలకు ముందు కామారెడ్డిలో భారీ సభను ఏర్పాటుచేసి బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో తమ నిర్ణయాలు.. విధానాలను 15న జరిగే సభలో వివరించబోతున్నట్లుగా సమాచారం. అందుకే అధినేత ఖర్గేతో పాటుగా, కీలక నేత రాహుల్ గాంధీని ఆహ్వానించే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. మరోవైపు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటుపై సైతం సమీక్షి నిర్వహించనున్నారు. అలాగే.. పెండింగ్‌లో ఉన్న అనేక నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరగనుంది. అంతేకాకుండా.. టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ పదవీ చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయనను నేతలు అభినందించనున్నారు.
రేవంత్ రెడ్డి కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు రాబోతున్నాయా.. అంటే అవుననే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ స్పీకర్ నోటీసులు పంపారు. అయితే ఈ జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ వ్యూహం ఏంటన్న దానిపైనే రాజకీయ సర్కిల్‌లో హాట్‌హాట్ టాపిక్‌గా మారింది.


