Congress Ministers| బీఆర్ఎస్ నేతలు కావాలనే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Thummla Nageswar rao), శ్రీధర్ బాబు(Sridhar Babu) విమర్శించారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. ఆర్థికంగా కష్టాలున్నా సరే రైతులుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాన్నామని తెలిపారు. సన్నధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు. సన్న ధాన్యం సేకరించి వారం లోపు బోనస్ చెల్లిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. ఇప్పుడేమో రైతుల కష్టాలపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులపై బీజేపీకి ప్రేమ ఉంటే తేమ శాతం నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సానుభూతి కోసం కేటీఆర్(KTR) పదే పదే అరెస్ట్ మాట ఎత్తుతున్నారని వెల్లడించారు. కేటీఆర్ అరెస్టుకు తమ ప్రభుత్వం ఎలాంటి కుట్రలు చేయడం లేదన్నారు.