భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkatrao) మంచి మనసు చాటుకున్నారు. భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో పాటు ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటించారు. వారి వెంట ఉన్న వారిలో కాంగ్రెస్ నేత సుధాకర్ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా ఆయన కిందపడిపోవడంతో వృత్తిపరంగా వైద్యుడు అయిన వెంకట్రావు వెంటనే సీపీఆర్(CPR) చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యవసర సమయంలో కార్యకర్త ప్రాణాలు కాపాడారంటూ వెంకట్రావుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.