పార్లమెంట్‌లో అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), జూపల్లి కృష్ణరావులు కూడా పాల్గొన్నారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదో చెప్పాలన్నారు. అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలిపారు. ఇక కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.