BRS complaint to election officer: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు ప్రధాన ఎన్నికల అధికారిని కలిశారు. బస్తీల్లో మద్యం ఏరులై పారుతోందని ఫిర్యాదు చేశారు. దుర్వినియోగానికి సంబంధించిన వీడియోలను, ఆధారాలను అందజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిబంధనలను తుంగలోకి తొక్కిందని తెలిపారు. డబ్బుతో ఓటర్లను ప్రలోభపెడుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
నగదు పంపిణీ వీడియోలు, ఫొటోలు: జూబ్లీహిల్స్ బస్తీల్లో కొందరు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మిక్సీలు, గ్రైండర్లు, చీరలు పంచుతున్నారని తెలిపారు. ఫేక్ ఓటర్ ఐడీలను సైతం పంచుతున్నట్లుగా తెలిపారు. దీంతో రేపు పోలింగ్‌లో దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బస్తీల్లో మద్యం ఏరులై పారుతోందని అన్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలను ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతలు అప్పగించారు. ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన వారిలో మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్‌లతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-bypoll-campaign-ends-money-distribution/


