- తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో ప్రజలు ‘ఐ ఫ్లూ’ కండ్ల కలకతో ఇబ్బంది పడుతున్నారు. బషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్వామినాథ్ కొంతమందికి కళ్ళ పరీక్షలు నిర్వహించారు. కళ్ళ పరీక్షకు వచ్చిన వారికి తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వామినాథ్ మాట్లాడుతూ.. జిల్లా వైద్య అధికారి డాక్టర్ పల్వన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. కంటి జాగ్రత్తలు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, గోరువెచ్చని నీరుతో కండ్లను శుభ్రం చేసుకోవాలి, ఉతికిన శుభ్రమైన బట్టలను ధరించుకోవాలి, గాలి ధూళి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కండ్ల కలక వచ్చిన వారితో జాగ్రత్త పాటించాలి. ఐ ఫ్లూన్ వైద్య పరిభాషలో కంజూక్స్ లైటింగ్ అంటారు వాడుక భాషల్లో కళ్ళ కలకలు అంటారు. కళ్ళు ఎరుపు లేదా గులాబీ రంగులోనికి మారుతాయి కళ్ళు గులాబీ రంగులోనికి మారడం వల్ల పింక్ ఐ అని కూడా అంటారు కొందరికి కళ్ళలో మంట కంటి నుంచి నీరు కారణము నిద్రలేచేసరికి రెప్పలు అతుక్కోవడము కళ్ళలో పూసి ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి అసలు కళ్ళు కలకలు ఎందుకు వస్తాయి ? ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి జలుబుకు కారణమైన వైరస్ వల్ల వస్తుంటాయి గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో చాలామంది వర్షపు నీళ్లలో కండ్లు తడవడంతో ఇది ఒక విధమైన వైరస్ అని డాక్టర్ చెబుతున్నారు. కంటినిపుల వైద్య అధికారి డాక్టర్ స్వామినాథ్ తగు జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. కళ్ళు ఎర్ర పడడం గులాబి రంగు మారడం గొంతు నొప్పి జలుబు ఇటువంటి వచ్చినవారు డాక్టర్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9573 70 7445 కి ఫోన్ చేసి తెలుసుకోగలరు.
conjunctivitis: ‘కండ్ల కలక’ వచ్చిన వారితో జర జాగ్రత్త
పరిశుభ్రంగా ఉండటం, మందులు వేసుకోవటం చాలా ముఖ్యం