Saturday, July 12, 2025
HomeతెలంగాణCouple Nude Videos: అశ్లీల వీడియోలు తీసి గ్రూప్‌ల్లో షేర్‌ చేస్తున్న దంపతులు అరెస్ట్!

Couple Nude Videos: అశ్లీల వీడియోలు తీసి గ్రూప్‌ల్లో షేర్‌ చేస్తున్న దంపతులు అరెస్ట్!

Couple Arrest for doing Nude Videos: ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత వల్ల ఎన్ని లాభాలున్నాయో అంతే మొత్తంలో నష్టాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా అశ్లీల వీడియోలు తీసి, వాటిని డబ్బులకు విక్రయించడం ఈ రోజుల్లో సర్వ సాధారణంగా అయిపోయింది. తాజాగా హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో నివసిస్తున్న ఓ దంపతులు ఈ తరహాలోనే విక్రయిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే?: ఉపాధి కోసం ఈ దంపతులు గత 4 నెలలుగా అశ్లీల ప్రదర్శనలు చేయడమే కాకుండా.. వాటిని లైవ్ మరియు రికార్డెడ్ వీడియోస్ చేసి ఆన్లైన్ వెబ్‌సైట్లకు మరియు ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానెల్స్‌లో ప్రదర్శించి భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో పాటు ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియో కాల్స్ చేయడం, లైవ్‌లో బాడీ చూపించడం.. శృంగారంలో పాల్గొనేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేయడం ఇలా పలు విధాలుగా చేస్తూ బాగా ఆర్జిస్తున్నారు. ఇందులో ఆరితేరిన ఈ దంపతుల కన్ను ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా గ్రూప్స్‌పై పడింది. అలాంటి గ్రూపుల్లో జాయిన్‌ అయి ఆ తర్వాత గ్రూప్‌లోని మెంబెర్స్‌కి వీడియో కాల్స్, లైవ్ బాడీ  షోస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదివరకే ఆన్‌లైన్‌ ఉన్న వీడియో లింక్స్‌ని గ్రూప్స్‌లో షేర్ చేయడం, ఆ తర్వాత వారికి  మెంబర్‌షిప్‌ ఆధారంగా సెక్సువల్ కంటెంట్ అందిస్తున్నారు.

సెటప్‌ చూస్తే షాక్‌: ఈ వీడియోలను షూట్‌ చేయడం కోసం వీరు నివసిస్తున్న భవనంలోనే స్పెషల్ గదిని అలంకరించుకున్నారు. ఈ నగ్న వీడియోలన్నీ ఇంట్లోనే తీస్తూ దందా కొనసాగిస్తున్నారు. ఈ మార్కెట్‌ని పసిగట్టిన దంపతులు యూత్‌ని టార్గెట్‌ చేస్తూ వారికి వీడియోలను పంపిస్తున్నారు. లైవ్ వీడియోల కోసం రూ. 2,000, రికార్డెడ్ వీడియోల కోసం రూ. 500 రూపాయలు డిమాండ్‌ చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. 

పలు పరికరాలు స్వాధీనం: వెబ్ కెమెరాలు, ఇతర కెమెరాల సెటప్‌లతో లైవ్ స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. అనంతరం వీడియోలను వెబ్‌సైట్లలోనూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కంప్లైట్స్ అందుకున్న పోలీసులు పకడ్బందీగా దంపతులను అరెస్ట్‌ చేశారు. అనంతరం వారి ఇంట్లో నుంచి కెమెరాలు, రికార్డెడ్ వీడియోస్ ఉన్న హార్డ్ డిస్క్‌, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

కఠినంగా శిక్షించాలి: డబ్బు కోసం ఇంతలా దిగజారడంపై పలువురు సోషల్‌ మీడియాలో వీరి తీరును కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల సమాజం తప్పుదోవ పట్టే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దంపతులకు కఠిన శిక్ష పడితేనే తర్వాత ఎవ్వరూ ఇలాంటి చేయడానికి ముందుకు రారని సూచనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News