తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డితో దయాకర్ దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు. ఇక సీఎం అద్దంకి దయాకర్‌కు శాలువ కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతిలను అభ్యర్థులుగా ప్రకటించారు. మరో సీటును మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది.
