పెద్దపెల్లి జిల్లాలోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్బితం వాటర్ ఫాల్స్ పర్యాటక స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి సందర్శించారు. ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ఏర్పాట్లను సిపి పరిశీలించారు. చనిపోయిన మానుపాటి వెంకటేష్ ప్రమాదం గల కారణాలు అదికారులను అడిగి తెలుసుకొన్నారు. వెంకటేష్ బాడీ బయటకు తీయడానికి సహకరించిన మాదాసు శ్రీనివాస్, ఆకుల గట్టయ్యలను ఆమె అభినందించారు.
వారిని సత్కారించి అభినందించాలని అధికారులను ఆదేశించారు. రెమా రాజేశ్వరి ఆ ప్రాంత స్థానికులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ ప్రాంత యువకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉందని, ప్రజలను సందర్శనకు అనుమతి ఇవ్వడం లేదని ఆహ్లాదం కోసం వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్, పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, గోదావరిఖని ఏసిపి తులా శ్రీనివాసరావు, పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్, మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, బసంత్ నగర్ ఎస్సై వెంకటేష్ పాల్గొన్నారు.
Peddapalli: సబ్బితం వాటర్ ఫాల్స్ వద్ద సీపీ
ప్రమాదాల నియంత్రణా చర్యల పరిశీలన