Saturday, November 15, 2025
HomeTop StoriesCP Sajjanar: మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులు, మానవబాంబులు- సీపీ సజ్జనార్‌

CP Sajjanar: మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులు, మానవబాంబులు- సీపీ సజ్జనార్‌

CP Sajjanar On Kurnool Bus Accident: మద్యం సేవించి వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులతో సమానమని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వ్యాఖ్యానించారు. మద్యం మత్తులో రోడ్లపై వారు చేసే పనులు ఉగ్రవాద చర్యలేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ విషాదంపై సజ్జనార్‌ తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటన క్షమించరాని నేరమని, నివారించదగిన మారణహోమం అని ఉద్ఘాటించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/allotment-of-symobols-in-jubilee-hills-by-election/

కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు, రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఈడ్చుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కొందరు తప్పించుకోగా మిగిలిన 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనకు ముందు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ డ్రైవర్‌ శివశంకర్‌ డివైడర్ ఢీకొని చనిపోయాడు. 

అయితే తొలుత మద్యం తాగిన బైకర్ అతివేగంతో వచ్చి బస్సును ఢీకొట్టాడని వార్తలు రాగా.. పోలీసులు సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శివశంకర్‌తో పాటు ఉన్న అతని స్నేహితుడి ఎర్రి స్వామి ప్రాణాలతో బయటపడటంతో ప్రమాదానికి సంబంధించిన పూర్తి విషయాలు వెల్లడయ్యాయి. 

Also Read: https://teluguprabha.net/viral/pm-modi-official-convoy-were-allegedly-spotted-at-a-local-car-wash/

కాగా, ఈ దుర్ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు. చెప్పండి!! వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!? సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది.’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మన సమాజానికి మాయని మచ్చ అని సజ్జనార్‌ అన్నారు. ఇది క్షమించరాని నేరం అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని.. పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్‌ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad