Saturday, November 15, 2025
HomeతెలంగాణChukka Ramaiah: చుక్కా రామయ్య చేత కేక్ కట్ చేయించిన సీఎస్ శాంతికుమారి

Chukka Ramaiah: చుక్కా రామయ్య చేత కేక్ కట్ చేయించిన సీఎస్ శాంతికుమారి

Chukka Ramaiah|హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఇంటికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari) వెళ్లారు. ఇవాళ రామయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లిన శాంతికుమారి.. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన చేత బర్త్‌ డే కేక్ కట్ చేయించారు.

- Advertisement -

అలాగే ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కూడా రామయ్య నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు చుక్కా రామయ్యకు విషెస్ చెబుతున్నారు. కాగా గత కొంతకాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad