Saturday, June 14, 2025
HomeతెలంగాణCS: తెలంగాణ కొత్త సీఎస్ శాంతి కుమారి

CS: తెలంగాణ కొత్త సీఎస్ శాంతి కుమారి

తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారిని కేసీఆర్ సర్కారు నియమించింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి త్వరలో బాధ్యతలు స్వీకరించారు. సోమేష్ కుమార్ స్థానంలో ఈమె నియమితులయ్యారు.

- Advertisement -

ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ఆఫీసర్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు.

గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతి కుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News