Customer Bad Experience at Eruvaka Hotel: రెడీమేడ్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఇంట్లో వండటం కంటే ఆర్డర్ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మరింతగా పెరిగింది. అయితే, ఫుడ్ డెలివరీపై కంప్లైంట్స్ కూడా ఇటీవలి కాలంలో పెరిగాయి. పాడైపోయిన ఆహారాలను పంపించిన సంఘటనలు గతంలో ఎన్నో చూసం. సరిగ్గా ఇలాంటి ఘటనే నగరంలో ఒకటి జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. కూకట్ పల్లి వివేకానంద నగర్కు చెందిన ఓ వ్యక్తికి కూడా రోజూ లానే బుధవారం ఉదయం జొమాటో యాప్లో దగ్గరలోని ఏరువాక హోటల్ నుంచి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ రిసీవ్ చేసుకున్న ఫుడ్ డెలివరీ బాయ్ ఏరువాక హోటల్కు వెళ్లి కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ తీసుకుని డెలివరీ చేశాడు. కస్టమర్ ఆ పార్శిల్ ఓపెన్ చేసి ఓ పాత్రలోకి సాంబార్ పోసుకుని తినడం ప్రారంభించాడు. కొంత తిన్న తర్వాత సాంబారులో ఓ చిన్న నల్లటి ఆకారం తిరుగుతూ కనిపించింది. అదేంటి అని పరిశీలనగా చూస్తే పురుగు అని తేలింది. దీంతో అప్పటికే కొంత తిన్న కస్టమర్ వాంతులు చేసుకున్నాడు. ఆ పార్సిల్‌ను వీడియో తీసి.. సగం తిన్న ఇడ్లీ, సాంబారు పార్శిల్ను తీసుకుని ఏరువాక హోటల్కు వెళ్లాడు. మీ హోటల్ నుంచి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేస్తే పురుగు వచ్చిందని యజమానికి చూపించాడు. అయితే యాజమాన్యం మాత్రం తమ తప్పేమీ లేదని, తాము సరిగ్గానే ప్యాక్ చేసి పంపుతామని బుకాయించారు. దీంతో హోటల్ యాజమాన్యానికి, కస్టమర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
శుచి, శుభ్రత పాటించని హోటళ్లు..
ఈ ఘటనను సదరు కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. కూకట్‌పల్లిలోని ఏరువాక హోటల్ తీరుపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరువాకలో ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉంటాయని, కానీ కనీస ప్రమాణాలు పాటించరని, నాణ్యత ఉండదని, ఆహారపదార్థాలు ఏమాత్రం శుభ్రంగా ఉండవని పలువురు కస్టమర్లు తమ అనుభవాన్ని పంచుకున్నారు.
ఆడ, మగకు ఒకే బాత్రూం..
ఏరువాక హోటల్‌లో కనీస సౌకర్యాలు లేవని మరికొందరు నెటిజన్లు వాపోయారు. హోటల్‌లో ఆడవారికి, మగవారికి కలిపి ఒకే ఒక బాత్రూం ఉంటుందని, తద్వారా మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఆ ఒక్క బాత్రూం కూడా శుభ్రంగా మెయింటెన్ చేయరని వాపోయారు. కనీస ప్రమాణాలు పాటించకుండా కొనసాగిస్తున్న ఏరువాక హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు.


