Dana Kishore| తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Sharma) ప్రిన్సిపల్ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ దాన కిషోర్‌కు అదనపు బాధ్యతలను అప్పజెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా దాన కిషోర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయనను గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే గవర్నర్ వద్ద కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ ఆమోదం పొందేలా దాన కిషోర్‌ను ప్రిన్సిపల్ సెక్రటీరగా నియమించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.