Friday, September 20, 2024
HomeతెలంగాణDantala Balaraju: కూతురు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసిన తండ్రి

Dantala Balaraju: కూతురు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసిన తండ్రి

సొంత కూతురుకి ఆదర్శ వివాహం

కొంతమంది చెప్పడానికే నీతులు చెపుతుంటారు. ఆచరించడానికి మాత్రం ఆలోచిస్తారు. నీతులు చెప్పే వారిలో మనం ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర పదే పదే ఈ మాటలు వినాల్సి వస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా నీతులు చెప్పటమే కాదు వాటిని ఆచరించడంలో కూడా మేమే ముందుంటామని నిరూపించారు కాకరవాయి గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ నాయకులు కామ్రేడ్ దంతాల బాలరాజు, తన రెండవ కుమార్తె,గీత మాధురి,తనతో పాటే చదువుకుంటున్న, ఓ యువకుడుని ప్రేమించిందనీ ఆ విషయం దాచుకోకుండా ధైర్యంగా తన తండ్రిపై తనకున్న నమ్మకంతో ప్రేమించిన విషయాన్ని తన తండ్రికి చెప్పగా వెంటనే తన తండ్రి బాలరాజు కూడా వారిద్దరి కులాలతో సంబంధం లేకుండా యాదగిరిగుట్టలో దగ్గరుండి వారిద్దరికీ వివాహం జరిపానని ఓ ప్రకటనలో అన్నారు. చిన్నప్పటి నుండి కమ్యూనిటీ సిద్ధాంతాలతో సిపిఐ పార్టీలో ఉన్నాం కమ్యూనిస్టు భావజాలం మా రక్తంలోనే ఉంది. నేను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులను ఆ కమ్యూనిస్టు భావజాలంతోటే నా కుతురుకు ఆదర్శ వివాహం.. జరిపానని బాలరాజు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News