Dead person wakeup before funeral moments: చనిపోయిన వ్యక్తిని స్మశానం దాకా తీసుకు వెళ్ళాక అనుకోకుండా అక్కడ ఆ వ్యక్తులు లేచి కూర్చున్న ఘటనలు మనం చాలా విని ఉన్నాం. సరిగ్గా అలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. అయితే అతను ఎవరిని చూసి లేచికుర్చున్నడో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.
ఆ వ్యక్తి చనిపోయాడని అందరూ అనుకున్నారు. చివరి చూపుగా బంధువులందరూ వచ్చేశారు. అంత్యక్రియలు మొదలైయ్యాయి. ఇంతలో ఊహించని అద్భుతం జరిగింది. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్న ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమకారుడుగా మంచి పేరుంది. ఉద్యమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేశాడు. ఉద్యమం సమయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి రమేష్ వీరాభిమానిగా మారాడు. ఆయనపై ఉన్న అభిమానానికి చెరగని గుర్తుగా తన ఛాతీపై నిరంజన్ రెడ్డి చిత్రం పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు.
అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు: వృత్తి రీత్యా కొన్నాళ్లుగా రమేష్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం కొద్దిసేపటికే రమేశ్ చాలా అస్వస్థతకు గురయ్యాడు. ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు. దీంతో బంధువులు రమేష్ మరణించాడని భావించారు. దీంతో ఆదివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంట్లోనే పడుకొబెట్టి పూలమాలలు వేశారు. బంధువుల ఏడుపులతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బాడీలో కదలికలను గుర్తించిన నిరంజన్ రెడ్డి: తైలం రమేష్ మరణ వార్తను కుటుంబ సభ్యులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రమేష్‌ను చివరిచూపు చూసేందుకు వెళ్ళాడు. రమేష్ పార్థివదేహానికి పూలమాల వేసేందుకు ముందుకు వంగటంతో బాడీలో కదలిక ఉన్నట్లు నిరంజన్ రెడ్డి గుర్తించారు. రమేష్… రమేష్ అంటూ గట్టిగా పిలవడంతో మరింతగా కదిలాడు. దీంతో హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మరణించాడనుకున్న రమేష్ బతికిబట్టకట్టడం ఆశ్చర్యపరిచిందని బంధువులు సంతోషించారు. ఇక రమేష్ కుటుంబ సభ్యులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమయస్ఫూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.


