Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ దంద్వనీతికి నిదర్శనం : కేటీఆర్

KTR: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ దంద్వనీతికి నిదర్శనం : కేటీఆర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు కేస్ స్టడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా యాన పోస్ట్ చేశారు.

- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ఇండియా కూటమిలో చేరి.. కాంగ్రెస్‌తో జతకట్టినప్పుడు ఆప్ పార్టీ నీతిగా ఉందన్నారు. కేజ్రీవాల్ తెలివైన, నీతివంతమైన నాయకుడని కాంగ్రెస్ ప్రశంసించిందని గుర్తు చేశారు. ఢిల్లీ అద్భుతంగా అభివృద్ధి పథంలో కనిపించిందన్నారు. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా నిలబడగానే ఆయన దోషిగా, నేరస్థుడుగా, ఢిల్లీ కాలుష్య నగరంగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుందన్నారు. అలాగే ఆప్ అవినీతి పార్టీగా మారిపోయిందని విమర్శించారు.

ఈ నాటకీయ మార్పు కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు పాఠ్యపుస్తకం లాంటి ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. ఇంత త్వరగా తమ అభిప్రాయాలను ఎలా మార్చగలిగారన్నది ఆశ్చర్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ ప్రజలకు హామీలు ఇచ్చే సమయంలో.. తెలంగాణలో మీరు ఇచ్చిన హామీల అమలు పూర్తయ్యయో లేదో తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad