Thursday, April 10, 2025
HomeతెలంగాణDelhi: జాతీయ రహదారుల వెంట డ్రైన్స్ మంజూరు చేయండని గడ్కరీని కలిసిన బీఆర్ఎస్ బృందం

Delhi: జాతీయ రహదారుల వెంట డ్రైన్స్ మంజూరు చేయండని గడ్కరీని కలిసిన బీఆర్ఎస్ బృందం

ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకిరు వైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో వారు గడ్కరీతో సమావేశమై తమ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులు, వాటి విస్తరణ, కొత్తగా కట్టిన కలెక్టరేట్ వద్ద అలైన్మెంట్ మార్పు, డ్రైన్స్ మంజూరు చేయాల్సిన అవసరం గురించి వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యే తన దృష్టికి తెచ్చిన అంశాలను మంత్రి సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News