హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(Hydra) మరోసారి దూకుడుగా ముందుకు వెళ్తోంది. మాదాపూర్‌లో ఆక్రమణలను కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే అయ్యప్ప సొసైటీలోని 100 అడుగుల రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. ఇప్పటికే 90 శాతం నిర్మాణం పూర్తి అయిన ఆ భవనాన్ని కూల్చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం అందుతోంది. గత ఏడాది ఈ భవన యజమానులకు జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులను పట్టించుకోని యాజమాన్యం నిర్మాణాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సైతం ఈ భవనం అక్రమ నిర్మాణమని తేల్చింది. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించారు. తాజాగా కూల్చివేత చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.