తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వరంగల్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న క్రమంలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద భట్టి కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు పొదల్లోకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.