దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ మరియు మండల స్థాయి గిడ్డంగి గోదాంను దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదాం నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన చర్యలు తప్పవని అన్నారు. రేషన్ దుకాణాల ద్వార నిత్యావసర సరుకుల పంపిణి, నిత్యావసర సరుకుల పంపిణిలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా రేషన్ దుకాణాలలో వేలిముద్రల, కంటి స్కానర్ (ఐరిస్) ద్వార తమ కోటాను రేషన్ కార్డుదారుడు సరైన తుకంతో పొందే విధంగా చూడాలని, ప్రత్యక్షంగా రైతుల నుండి ఐ.కే.పి., పి.ఎ.సి ల ద్వారా సగటు మద్దతు ధరలకు వరిని ధ్యాన్యాన్ని సేకరించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అధికారులను ఆదేశించారు.
దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ సంక్షేమ వసతి గృహాలకు, అంగన్వాడి సెంటర్లకు, ప్రభుత్వ పాఠశాలలకు మద్యహ్న భోజన పధకం ద్వార సన్న బియ్యం జారీచేయడంలోను, అర్హలైన కుటుంబాలకి దీపం కనెక్షన్ల కేటాయించడంలోను నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్నారు. అనంతరం గోదాం హమాలీ కూలీల స్థితిగతులు, వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ దూదిపాల వేణుదర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు కిన్నెర హరికృష్ణ, డిటీసీఎస్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్, డీలర్ కొర్ర శంకర్ పాల్గొన్నారు.