Sunday, October 6, 2024
HomeతెలంగాణDGP: డా.బాబు జగ్జీవన్ రామ్ కి డీజీపీ నివాళి

DGP: డా.బాబు జగ్జీవన్ రామ్ కి డీజీపీ నివాళి

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా డీజీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి డీజీపీ అంజనీ కుమార్ తో సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ జయంతి కార్యక్రమంలో అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఐజీలు షా నవాజ్ ఖాసీం, చంద్రశేఖర్ రెడ్డి లతో సహా పలువురు అధికారులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలర్పించారు.

- Advertisement -

ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, బడుగు వర్గాలకు చెందిన బాబు జగ్జీవన్ రామ్ భారత పార్లమెంటులో పలు మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా, ఉప ప్రధానిగా కూడా పనిచేశారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News