Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంతంగా సాగుతోంది. సాధారణ ఓటర్లతో పాటు సెలబ్రిటీలు సైతం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినుయోగించుకునేందుకు క్యూ లైన్‌లలో ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి షేక్‌పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు శ్రీకాంత్ సైతం ఓటు వేశారు.
కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేస్తున్న సెలబ్రిటీలు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. షేక్‌పేటలోని ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో జక్కన్న ఓటు వేశారు. ఆయన తమ కుటుంబ సభ్యులతో కలిసి షేక్‌పేటలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే నటుడు శ్రీకాంత్ సైతం కుటుంబ సభ్యులతో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/jubilee-hills-by-poll-updates-2/
ఫస్ట్ టైం ఇలా: కేంద్ర ఎన్నికల కమిషన్ మొదటిసారిగా ఈ ఉపఎన్నికలో పలు సంస్కరణలను తీసుకువచ్చింది. మొదటిసారిగా ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా తొలిసారిగా సెక్యూరిటీ కోసం డ్రోన్లతో మానిటరింగ్ చేపట్టారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ డిపాజిట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్‌ను సైతం తొలిసారిగా ఏర్పాటు చేశారు. మొదటిసారి పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు.


