Friday, November 22, 2024
HomeతెలంగాణSingareni: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. ఒక్కో కార్మికుడి ఖాతాలో ఎంత జమ కానుందంటే..?

Singareni: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. ఒక్కో కార్మికుడి ఖాతాలో ఎంత జమ కానుందంటే..?

Singareni| సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti vikramarka) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్‌ను శుక్రవారమే చెల్లిస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.358 కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ బలరాంను ఆయన ఆదేశించారు.

- Advertisement -

శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దీపావళి బోనస్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750లు అందుకోనున్నారు. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 42,000 మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. కాగా గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికం కావ‌డం విశేషం. బొగ్గు పరిశ్రమ కోసం జేబీసీసీఐ(JBCCB) విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్‌ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంది. ఇటీవలే సింగరేణి కార్మికులందరికీ లాభాల కింద రూ.796కోట్లను కంపెనీ ఇచ్చింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1.90లక్షలు అందాయి. ఇప్పుడు దీపావళికి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వనుండటంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News