తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమొళి, రాజాలు సమావేశమయ్యారు. ఈ నెల 22వ తేదీన డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో ఏర్పాటుచేసిన జేఏసీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రేవంత్‌కు ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం పగబట్టిందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రంపై పోరాటం చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఈ నెల 22వ తేదీన స్టాలిన్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటామని వెల్లడించారు.
