సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు చేస్తే చర్యలు తప్పవని మహబూబాబాద్ ఎస్పీ చంద్రమోహన్ హెచ్చరించారు. వాట్సాప్ గ్రూప్లలో, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ సక్రమంగా వాడుకోవాలని ఆట్లాకాకుండా ఒక వ్యక్తికి/సామాజిక వర్గనికి/పార్టీల స్వేచ్ఛ, భద్రతకు, గౌరవానికి భంగం కలిగేవిధంగా సోషల్ మీడియా వేదికగా హై ప్రొఫైల్ విఐపిలను టార్గెట్ చేసి వాళ్ళను కించపరిచే విధంగా పోస్ట్ లు పెట్టిన, వ్యంగ్యంగా మీమ్స్, ఫోటో మార్ఫింగ్ లు వీడియోలు పెట్టినా, కటినమైన చర్యలు తీసుకుంటామని, ఎదుటి వారి ప్రతిష్టకు ఎవరూ భంగం కలిగించరాదని ఎస్పీ చంద్ర మోహన్ తెలిపారు. రెచ్చగొట్టే, కోపొద్రేకంగ వుండే పోస్టులను ఎవరైనా పోస్టులు చేస్తే శాంతి భద్రలకు కూడా భంగం కలుగుతుంది, కావున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చట్టరీత్యా చర్యలు తీసుకోబడును, గ్రూప్ అడ్మిన్ తక్షణమే అట్టి పోస్టులను గ్రూపు నందు తొలగించాలి, లేనియెడల పోస్ట్ చేసిన వారిపై,గ్రూప్ అడ్మిన్ లపై ఇండియన్ పీనల్ కోడ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాజీ యాక్ట్ 2008 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడునని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ చంద్ర మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.