అయోధ్య శ్రీ రాముని దర్శనం కోసం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతున్న ట్రైన్ ను కాషాయం జెండా ఊపి ప్రారంభిస్తున్న దుబ్బాక మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు, మెదక్ పార్లమెంట్ అయోధ్య ట్రైన్ ఇంచార్జ్ కొండాపురం జగన్. ఈ సందర్భంగా కొండాపురం జగన్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రామ భక్తులకు ప్రతి నెలా ఒక పార్లమెంటుకు ఒక ట్రైన్ సబ్సిడీపై అయోధ్యకు పంపుతామని, ఒక వ్యక్తికి 3500 చార్జెస్ ఉంటే కేవలం 1800కే రైల్వే శాఖ సబ్సిడీతో అయోధ్య రాముని దర్శనం చేయిస్తున్నారు. దీన్ని పెద్ద ఎత్తున రామభక్తులు సద్వినియోగం చేసుకోవాలని జగన్ తెలిపారు.
ఈ యాత్రలో నాయకులు నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్, ఎస్ ఎన్ చారి, నర్సారెడ్డి, గోవింద్, హనుమంత్ రెడ్డి, మహేందర్, నరసింహారెడ్డి, రవీందర్, శ్రీనివాస్, స్వామీ వీరితోపాటు 1344 మంది మెదక్ పార్లమెంట్ వారు రాముడు దర్శనానికి బయలుదేరడం జరిగింది.