తెలంగాణలో కొత్త రేషన్ కార్డు(Ration cards) దరఖాస్తులకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున దరఖాస్తుల స్వీకరణ నిలిపివేయాలని ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు కూడా చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.
- Advertisement -
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణతో పాటు పాత కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం మీసేవ కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసింది. అయితే దీనిపై ఈసీకి ఫిర్యాదు రావడంతో మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు బ్రేక్ వేస్తూ ఈసీ ఉత్తర్వులు విడుదల చేసింది.