Sunday, December 29, 2024
HomeతెలంగాణKTR: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

KTR: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(KTR) ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఈ కేసుకు సంబంధించి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ(HMDA) మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 2, 3న విచారణకు రావాలని తెలిపింది. ఏసీబీ ఎఫ్ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ(PMLA) కింద ఈడీ విచారణ చేస్తోంది.

- Advertisement -

కాగా ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని చేర్చింది. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో.. దీనిపై విచారణ చేయాలని సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీంతో కేసు నమోదుచేసిన ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 31వరకు అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News