Friday, December 12, 2025
HomeతెలంగాణSheep Distribution Scam in Telagnana: గొర్రెల పంపిణీ స్కామ్‌లో 15న ఈడీ విచారణ

Sheep Distribution Scam in Telagnana: గొర్రెల పంపిణీ స్కామ్‌లో 15న ఈడీ విచారణ

Sheep Distribution Scam: బీఆర్ఎస్‌ హయంలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. బాధితులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. మొయినుద్దీన్ అనే దళారి.. ఏపీకి చెందిన రైతుల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి, వారికి డబ్బు చెల్లించలేదని ఈడీ గుర్తించింది. అధికారులు, బ్రోకర్లతో కుమ్మకై బినామీ ఖాతాలకు ఆ డబ్బులను బదిలీ చేసినట్టు ఈడీ దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో సుమారు రూ. 2 కోట్ల మేర మోసం జరిగినట్టు ఈడీ గుర్తించింది.

- Advertisement -

ఇదిలా ఉండగా, గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా గొర్రె పిల్లల కొనుగోలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండాపూర్‌‌‌‌లోని ‘లోలోనా ది లైవ్’ అనే సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. సంస్థకు చెందిన సయ్యద్ ఖాజా మొయినొద్దీన్‌, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి కలిసి ఏపీలోని రైతుల నుంచి 133 యూనిట్లు కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన రూ.2.10 కోట్లు తమ బినామీల అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్‌లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ వ్యవహారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖజానకు భారీ నష్టం జరిగిందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసును ఏసీబీకి బదిలీ చేసింది. మరోవైపు సయ్యద్ ఖాజా మొయినొద్దీన్‌, ఆయన కొడుకుతో కలిసి విదేశాలకు పారిపోయారు. దీంతో మొయినుద్దీన్‌పై లుక్ ఔట్ నోటీస్ జారీ అయ్యింది. ఈ ఏడాది మేలో మొయినుద్దీన్‎ను ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా.. ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. 2021 మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ ఆడిట్ నివేదికలోనూ గొర్రెల పంపిణీ పథకంలో పెద్దఎత్తున కుంభకోణం జరిగినట్లు వెల్లడైంది. నివేదిక ప్రకారం 7 జిల్లాల్లో రూ.253.93 కోట్ల నష్టం జరిగినట్లు తేలింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News