Monday, July 14, 2025
HomeతెలంగాణTG BJP: జులై 1న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక

TG BJP: జులై 1న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక

TG BJP President Election: బీజేపీ పెద్దలు తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం కీలకమైన రాష్ట్ర అధ్యక్షుడి పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. కొంతకాలంగా రాష్ట్రంలో కమలం నేతలు, కార్యకర్తలు ఎంతగానే ఎదురుచూస్తున్న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. అధ్యక్షుడి ఎన్నికకు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం ఈ పదవికి పోటీ పడే నాయకుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం జులై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు. ఈమేరకు బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రకటన చేశారు.

మొత్తానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షపదవికి ఎన్నిక నిర్వహించనుండటంలో ఆశావహులు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొంతకాలంగా అధ్యక్ష పదవి కోసం పలువురు కీలక నేతలు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో లాబీయింగ్ కూడా చేసి వచ్చారు. ముఖ్యంగా అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, డీకే అరుణ పోటీలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ను తిరిగి అధ్యక్షుడిగా ఎంపిక చేసినా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుటున్నారు.

గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి ఉన్న సమయంలో బీజేపీ క్యాడర్ ఉత్సాహంగా పనిచేసేది. ముఖ్యంగా అప్పటి సీఎం కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలపై బండి తీవ్రంగా విరుచుకుపడేవారు. కౌంటర్ కు అంతే స్థాయిలో తిరిగి కౌంటర్ ఇచ్చేవారు. దీంతో కమలం కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉండేవారు. బండి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక, దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నడూ లేని విధంగా వార్డులు గెలుచుకుని సత్తా చాటింది.

అయితే ఏమైందో ఏమో గానీ బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తొలగించి కిషన్ రెడ్డికి అప్పగించింది. అధిష్టానం నిర్ణయంతో బీజేపీ క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అప్పటి నుంచి కిషన్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీంతో తీవ్ర పోటీ దృష్ట్యా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతోదంనని కాషాయం శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News