Wednesday, December 4, 2024
HomeతెలంగాణEncounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Encounter: తెలంగాణలోని ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. జిల్లాలోని చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల(Maoists)కు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌(Greyhounds Forces), యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ఇక మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు తెలుస్తోంది. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్న మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుల్లో కురుసం మంగు అలియాస్‌ భద్రు అలియాస్‌ పాపన్న (35), ఎగోలపు మల్లయ్య అలియాస్‌ మధు(43), ముస్సకి దేవల్‌ అలియాస్‌ కరుణాకర్‌(22), ముస్సకి జమున (23), జైసింగ్‌ (25), కిశోర్‌ (22), కామేశ్‌( 23) ఉన్నట్లు వెల్లడించారు.

మృతి చెందిన మావోయిస్టుల వివరాలు.

1. కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న.. TSCM, సెక్రటరీ ఇల్లందు – నర్సంపేట AC, AK-47 రైఫిల్.
2. ఈగోలపు మల్లయ్యఅ అలియాస్ మధు.. DVCM, కార్యదర్శి ఏటూరునాగారం, మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్.
3. ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్, ACM.
4. ముస్సకి జమున ACM.
5. జైసింగ్, పార్టీ సభ్యుడు.
6. కిషోర్, పార్టీ సభ్యుడు.
7. కామేష్,పార్టీ సభ్యుడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News