ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 9 వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన జనగామ జిల్లాలోని 36 గ్రామ పంచాయతీలకు అవార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందచేశారు.
ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 9 వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి ఈ అవార్డులు అందచేశారు. స్థానిక స్వపరిపాలనలో పంచాయతీల పనితీరును మెరుగు పరచడానికి, వారిని ప్రోత్సహించడానికి ఈ అవార్డులు అందచేస్తున్నట్టు ఆయన వివరించారు. పంచాయతీల మధ్య, సర్పంచుల మధ్య పోటీ తత్వం పెరిగి, మరింత అభివృద్ధి జరగాలనేది తమ సంకల్పమన్నారు.
పేదరికం లేని, ఆరోగ్యవంతమైన, చైల్డ్ ఫ్రెండ్లీ, నీరు సమృద్ధిగా ఉన్న, పచ్చదనం, పరిశుభ్రత కలిగిన, మౌలిక సదుపాయాలతో కూడిన స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, సుపరిపాలన ఉన్న, మహిళా స్నేహ పూర్వక వంటి మొత్తం 9 అంశాలలో ఒక్కో విభాగానికి 3 చొప్పున గ్రామాలను ఎంపిక చేసి, అవార్డులు ఇస్తున్నట్టు ఎర్రబెల్లి తెలిపారు.