Sunday, November 10, 2024
HomeతెలంగాణErrabelli: రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రమే

Errabelli: రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రమే

రైతులు పండించిన ధాన్యం కానీ మక్కలు కానీ కొనుగోలు చేస్తున్నది ఒక తెలంగాణ రాష్ట్రమేనని దేశంలో ఏ రాష్ట్రాలు కొనుగోలు చేయడం లేదని ఇది ప్రజలు గ్రహించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి పెద్ద వంగర మండలంలో విస్తృతంగా పర్యటించారు. బంగారు చెలిమి తండాలో సర్పంచ్ ధరావత్ పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భాగ్యలక్ష్మి మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రము రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తెలంగాణ మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్తు, సాగునీరు కొరతలేదని అన్ని వనరులు సమృద్ధిగా లభించడంతో రైతులు ఆనందంగా పంటలు పండించుకుంటున్నట్లు చెప్పారు.
1600 పలుకుతున్న మక్కలకు రాష్ట్ర ముఖ్యమంత్రి 1962 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయటం రైతుల పక్షపాతిగా పేర్కొన్నారు రైతులు అకాల వర్షాలకు దాన్యం తడిసిందని అధైర్య పడరాదని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రెండు పంటలు పండడంతో భూములకు కూడా ధరలు పెరిగాయి అన్నారు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు తిరుమలగిరి నుండి హరిపిరాల మీదుగా పెద్ద ముప్పారం వరకు డబల్ రోడ్డును 20 కోట్లతో మంజూరు చేసామన్నారు. అనంతరం అవుతాపురం రైతు వేదికలో ఏర్పాటుచేసిన కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.
జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరును సంబంధిత అధికారులతో పర్యవేక్షిస్తూ ధాన్యం మక్కల కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న వంగర ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి సెంటర్ ఇన్చార్జి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు అనంతరం అదే రోజు రవాణా చేపట్టా లన్నారు. ప్రతి సెంటర్లో టార్పాలిన్స్ అందుబాటులో ఉంచుకోవాలని అవసరమైతే అదనంగా తెప్పించుకోవాలని అడిగిన రైతులకు కూడా అద్దెకు ఇవ్వాలన్నారు. చిట్యాల కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ రైతులతో మాట్లాడారు. ధాన్యం నాణ్యతతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యాన్ని నేరుగా మిల్లర్లకు అమ్మ రాదని సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, సహకార సంఘ చైర్మన్ హరి ప్రసాద్, సహకార శాఖ అధికారి ఖుర్షిద్, అదనపు పీడీ వెంకట్, తాసిల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి కుమార్, జెడ్పిటిసి జ్యోతిర్మయి, ఎంపీపీ ఈదూరి రాజేశ్వరి, డిపిఎం నళిని, సివిల్ సప్లై డిటి నారాయణరెడ్డి, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News