Thursday, July 4, 2024
HomeతెలంగాణErrabelli: చాకలి ఐలమ్మకు స్వగ్రామం పాలకుర్తిలో పుష్పాంజలి

Errabelli: చాకలి ఐలమ్మకు స్వగ్రామం పాలకుర్తిలో పుష్పాంజలి

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె స్వగ్రామం, జనగామ జిల్లా పాలకుర్తి లోని ఆమె కాంస్య విగ్రహానికి పూల మాల వేసి, పుష్పాంజలి ఘటించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా మంత్రి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ని గుర్తు చేసుకుంటూ, నినాదాలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారీమణి చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి పుష్పాంజలి

- Advertisement -

 చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి లను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కెసిఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

 తెలంగాణ వీర వనిత, ధైర్య శాలి చాకలి (చిట్యాల) ఐలమ్మ

 అనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్ ముఖులను ఎదుర్కొన్నది.  నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ

 రాయపర్తి మండలం కిష్ట పురం లో 1895, సెప్టెంబర్ 26న పుట్టింది.

 పాలకుర్తి కి చెందిన చిట్యాల నర్సయ్య తో పెండ్లి జరిగింది

 అయిదుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు

 కుల వృత్తి జీవన ఆధారంగా బతికింది.

 మల్లంపల్లి కొండల రావు కు చెందిన పాలకుర్తిలో ని భూమిని కౌలు కి తీసుకొంది. నాలుగు ఎకరాలు పండించింది.

 ఆ సమయంలో స్థానిక పట్వారీ పొలంలో పనికి రాని ఐలమ్మ పై కమ్యూనిస్టుల లో చేరిందని ఆయన దేశ్ ముఖ్ కి ఫిర్యాదు చేశాడు.

 ఐలమ్మ సాగు చేసిన పొలాన్ని తన పేరున రాయించుకొని ఆ పొలం తనదేనని, ఆ పంట కూడా తనదేనని తన మనుషులను పంపించాడు.

 సంఘం సహాయంతో వాళ్ళని తిప్పి పంపిన ఐలమ్మ, కోర్టు లో కేసు వేసి, అనాడు పేరు మోసిన లాయర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారం తో గెలిచింది.

 నాడు సంగంగా పిలిచే, కమ్యూనిస్టుల తో చేయి కలిపి తన పొలాన్ని దేశ్ ముఖ్ గుండాల నుండి కాపాడుకుంది

 వారు చేసిన ఆనాటి ఉద్యమమే, తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయింది. ఆ తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యింది

 చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ ఆనాటి దేశ్ ముఖులు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించింది.

 ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మ లాగా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలు

 ఐలమ్మ తన 90వ ఏట, 1985 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో మరణించారు

 ఐలమ్మ స్ఫూర్తి తోనే సీఎం కెసిఆర్ తెలంగాణ సాధించారు  అదే స్ఫూర్తి ని సీఎం కెసిఆర్ కొనసాగిస్తున్నారు

 పరిపాలన లో ఉద్యమ స్ఫూర్తిని పాటిస్తున్నారు

 అందుకే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా మారింది ఐలమ్మ జయంతి, వర్ధంతి లను అధికారికంగా నిర్వహిస్తుండటం పట్ల సీఎం కెసిఆర్ గారికి ధన్యవాదాలు

 మరోసారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘనంగా పుష్పాంజలి ఘటిస్తున్నాను.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News