రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోస్ట్ మార్టం గదిని ప్రారంభించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గర్భిణీలలో పోషక ఆహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కే.సి.ఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు. కెసిఆర్ కిట్ లను అందచేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను, NCD కిట్ లను పరిశీలించారు. అలాగే, బీపీ ఆపరేటర్ల ను పంపిణీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:
వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగతున్నది. ఇందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగినది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2021 హెల్త్ ఇండెక్స్ లో ఓవరాల్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ 3 వ స్థానంలో, పురోగతిలో మొదటి స్థానంలో, వ్యాక్సినేషన్, ప్రసవాల పురోగతిలో టాప్ లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళశాల కూడా ఇవ్వనప్పటికీ ఆరోగ్య తెలంగాణలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరీ చేసి పనులు పురోగతిలో ఉన్నవి. అలాగే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిని అదనముగా రెండు వేల పడకలకు పెంచడంతోపాటు హైదరాబాద్ నగరం చుట్టూ 4 వేల 200 పడకల తో నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరుగుతున్నది.
వరంగల్లో 24 అంతస్తులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం 11 వందల కోట్ల ఖర్చుతో నిర్మించడం జరుగుతున్నది. నూతనంగా ఏర్పడిన జనగాం జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరీ చేసి రూ. 18 కోట్ల 70 లక్షలతో నిర్మాణ పనులు జరుగుచున్నాయి. మన పాలకుర్తి ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 30 పడకల తొర్రూర్ ఆసుపత్రి ని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తొర్రూర్ లో 16 లక్షలతో మార్చురీ భవనము నిర్మాణము చేసి ప్రారంభించుకున్నాము. పాలకుర్తి లో 33 లక్షల ఖర్చుతో మార్చురీ భవనము ఈ రోజు ప్రారంభించుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టరేట్ ప్రఫుల్ దేశాయ్, drdo రాంరెడ్డి, dm&ho ప్రశాంత్, డాక్టర్లు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.