Sunday, October 6, 2024
HomeతెలంగాణErrabelli: ఎంపీఓలు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు

Errabelli: ఎంపీఓలు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు

తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వానికి మంచి పేరు తేవడంలో ఎంపీఓల పాత్ర, కృషి చాలా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మన గ్రామాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచి, అనేక అవార్డులు రావడంలోనూ ఎంపీఓల కృషిని మరువలేనన్నారు ఎర్రబెల్లి. తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖకు మంచి పేరు తెచ్చారని ఆయన ఎంపీఓలను అభినందించారు. గ్రామాలను అభివృద్ధి పరచడంలో, పరిశుభ్రంగా ఉంచడంలో, ఉపాధి హామీ పనుల్లో, అనేక విధాలుగా వాళ్ళు పని చేస్తున్నారన్నారన్నారు. వరంగల్-హనుమకొండ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎంపీఓల సంఘం క్యాలెండర్, డైరీని మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News