Saturday, October 5, 2024
HomeతెలంగాణErrabelli: మున్సిపల్ కార్మికుల సేవలు విశిష్టమైనవి

Errabelli: మున్సిపల్ కార్మికుల సేవలు విశిష్టమైనవి

మున్సిపాలిటీల అభివృద్ధికి మీ అందరి సహకారం అందించండి

పట్టణ అభివృద్ధి మన వ్యక్తిగత వికాసాలకు మార్పు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తొర్రూర్ పట్టణ కేంద్రంలోని బస్టాండు నుండి ఎల్ వై ఆర్ గార్డెన్ వరకు తొర్రూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వాహనాలు, సాంప్రదాయ బతుకమ్మ కోలాటాలు, బోనాలతో ర్యాలీ నిర్వహించగా రాష్ట్ర మంత్రికి ప్రజలు నీరాజనం పలికారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గతంలో మేజర్ గ్రామపంచాయతీగా తొర్రూరు ఉన్నప్పటికీ ఎలాంటి వసతులు లేకుండా అస్తవ్యస్తంగా ఉండేదని, 2018 లో తొర్రూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకొని కెసిఆర్, కేటీఆర్ సారధ్యంలో వారి చొరవతో 100 కోట్ల రూపాయల నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నామని మంత్రి వెల్లడించారు.150 కోట్ల నిధులతో పనులు త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామని తొర్రూరు పట్టణ రూపురేఖలు మారబోతున్నాయని విభిన్న కట్టడాలతో, మహర్దశ సంతరించుకోనున్నట్లు మంత్రి తెలిపారు.
తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు 3. కోట్ల 50 లక్షలు, మురుగునీటి వ్యర్ధాల శుద్ధికరణ కేంద్రం ఏర్పాటుకు 6కోట్లు, రజకుల కోసం ధోబిఘాట్ కు 2 కోట్లు, మలమూత్ర వ్యర్ధాల శుద్ధికరణ కేంద్రం ఏర్పాటుకు 87 లక్షలు, 27 కోట్లతో పట్టణంలో 24 గంటలు నల్ల నీరు సరాఫరాకు కేటాయిస్తున్నట్లు, మోడ్రన్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కు 2 కోట్లు, మినీ ఆడిటోరియం, బస్టాండ్ నుండి పాలకేంద్రం వరకు సెంటర్ లైటింగ్, ప్రతి వార్డ్ కౌన్సిలర్లకు వివిధ నిర్మాణ పనులకు 1కోటి రూపాయల చొప్పున అందజేయనైనదని, పట్టణంలో ఏర్పాటు చేసిన యతిరాజరావు పార్క్ రాష్ట్రానికే ఆదర్శమని, మోడల్ మార్కెట్ సెంటర్ లైటింగ్, అన్నారం రోడ్డుకు డబుల్ రోడ్డు చేయడం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో రూమ్ ల కిరాయిలు, భూములకు ధరలు పెరిగాయని, దుబ్బ తండా గ్రోమోర్ నుండి పాలకేంద్రం వరకు విభాగిని ఏర్పాటు చేయనున్నట్లు, వైకుంఠ ధామాలు, పట్టణంలోని ఆయా కుల సంఘాల భవనాలకు లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుందని, ట్రేడ్ ఆక్టివిటీ పెరిగిందని, ఆరోగ్య దీప్తి చైతన్య స్ఫూర్తితో తొర్రూర్ మున్సిపాలిటీని వసతుల కల్పనలో ఆరోగ్యవంతమైన స్వచ్ఛతమైన, పట్టణంగా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంచుతానని, 5 సంవత్సరాలలో సుమారు 200 కోట్లతో అభివృద్ధి పనులతో మున్సిపాలిటీని తీర్చిదిద్దుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
726 డబుల్ బెడ్ రూమ్ లు సాంక్షన్ అయ్యి వివిధ నిర్మాణాల దశల్లో ఉన్నాయని, ఇందులో ఎస్సీ కాలనీకి 163 కేటాయించామని, రిక్షా కాలనీకి 50, దుబ్బ తండా మొదలైన ప్రదేశాల్లో జనాభా ప్రతిపాదికన నిర్మించడం జరుగుతుందని నాటికి నేటికీ ఎంతో వ్యత్యాసం ఉందని అభివృద్ధిలో దూసుకుపోతున్నామని, ప్రతి ఒక్కరు అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కెసిఆర్ నాయకత్వంలో పట్టణాల మున్సిపాలిటీల అభివృద్ధికి మీ అందరి సహకారం అందించాలని మంత్రి అన్నారు.

- Advertisement -


జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ మాట్లాడుతూ దేశంలోనే తొర్రూరు మున్సిపాలిటీ 150 నుండి 31 ఉందని, పచ్చదనంతో అద్భుతమైన అభివృద్ధి పనులతో , నిర్మాణాలతో తొర్రూరు ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటుందని, గ్రీనరీలో ముందంజలో ఉందని గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీ అప్గ్రేడ్ తర్వాత ఎక్కువ నిధులతో అభివృద్ధి చేసుకొని పట్టణ నలు దిశల అన్ని అంగుల్లో అభివృద్ధి జరుగుతుందని ప్రణాళిక బద్ధంగా భవిష్యత్తు అవసరాలకు ప్రజలకు అనుగుణంగా పట్టణ నిర్మాణం అభివృద్ధి సంక్షేమంలో తొర్రూర్ మున్సిపాలిటీ ముందుంటుందని ప్రజలందరూ సహకరించాలని పరిశుభ్రత విధిగా పాటించాలని, తోర్రురు ప్రజలు జీవన ప్రమాణాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడం జరిగిందని, అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
అనంతరం మున్సిపాలిటీ సిబ్బంది సేవలను గుర్తించి శాలువా కప్పి మంత్రి, అదనపు కలెక్టర్, చైర్మన్, వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ లు వారిని ఘనంగా సత్కరించారు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్పు క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారుల జట్టు లను షీల్డ్, శాలువాలతో సత్కరించారు. సహపంక్తి భోజనంలో మంత్రి స్వయంగా వడ్డించారు. వైకుంఠధామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేవూరి సోమయ్య స్మారకర్థం 8 లక్షలతో ఏర్పాటు చేసిన భవనాన్ని , పట్టణ శివారులోని అంగడి ప్రాంతంలో 20 లక్షలతో నిర్మించిన ఎనిమల్ బర్త్ కంట్రోల్ ధావాఖానను, ఎస్బిఐ బ్యాంకు వెనకాల 20 లక్షలతో నూతన బస్తీ దావఖాన నిర్మాణం కు మంత్రి, అదనపు కలెక్టర్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగా సురేందర్ రెడ్డి, ఎంపీపీ చిన్న అంజయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్, ఆర్డీవో ఎల్ రమేష్, మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్ , తహసిల్దార్ నాగేంద్ర ప్రసాద్, వివిధ వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News