Saturday, September 21, 2024
HomeతెలంగాణErrabelli: పాల‌కుర్తి అభివృద్ధికి మ‌రో 100 కోట్లు

Errabelli: పాల‌కుర్తి అభివృద్ధికి మ‌రో 100 కోట్లు

పాల‌కుర్తి అభివృద్ధికి ఎంతైనా ఖ‌ర్చు చేస్తాను. ఇప్ప‌టికే రూ.150కోట్లు ఖ‌ర్చు చేశా, మ‌రో రూ.100 కోట్లు ఖ‌ర్చు చేస్తాను. త్వ‌ర‌లోనే పాల‌కుర్తిలో డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తాను. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుండే త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. ప్ర‌ముఖ చారిత్ర‌క‌, అధ్యాత్మిక‌, ప‌ర్యాట‌క కేంద్రంగా పాల‌కుర్తి అభివృద్ధి చెందుతోంది. కెసిఆర్ హ‌యాంలోనే పురాత‌న దేవాల‌యాల‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చింది. సీఎం కెసిఆర్ వ‌ల్లే అభివృద్ధి జ‌రుగుతోంది. ఈ అభివృద్ధిని చూడ‌లేకే ప్ర‌తిప‌క్షాలు కుళ్ళుకుంటున్నాయి. కుట్ర‌లు, కుతంత్రాలు పన్నుతున్నాయి. ప్ర‌జ‌లు వాటిని గుర్తించాలి. గ‌త‌, ఇప్ప‌టి అభివృద్ధిని విశ్లేషించుకోవాలి. వారి విమ‌ర్శ‌లు తిప్పి కొట్టి, కెసిఆర్ కు అండ‌గా నిల‌వాలి. అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

- Advertisement -

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోగల పాలకుర్తి మండలం పాలకుర్తి ఎంపీటీసీ-1, ఎంపీటీసీ-2 లకు కలిపి బృందావన్ గార్డెన్స్ లో, దర్దేపల్లి, కొండాపురం గ్రామాలకు కలిపి దర్దేపల్లి లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాల‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…సీఎం కెసిఆర్ గారి ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఇప్పటి వరకు సుమారు 150 కోట్ల రూపాయల నిధులతో పాలకుర్తి ని అభివృద్ధి చేశాను అన్నారు. పాలకుర్తి మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం వుంది అన్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం మ‌రో రూ.100 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన డిగ్రీ కాలేజీని వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించి తరగతులు నిర్వహిస్తాం అని తెలిపారు. బీసీ కుల వృత్తులు చేసుకునే వారికి రూ.1ల‌క్ష చొప్పున ఆర్థిక స‌హ‌కారం ఇవ్వాలని సీఎం కెసిఆర్ గారు నిర్ణయించారని త్వరలో అర్హులను గుర్తించి అందిస్తాం అన్నారు. అలాగే ప్ర‌తి సామాజిక కులానికి ఒక క‌మ్యూనిటీ హాలు అవసరం వుందని నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. సీఎం కెసిఆర్ గారి మార్గ నిర్దేశనంలో ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పాలకుర్తి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పనులు చేస్తున్నాం అన్నారు. త్వరలో ఆ పనులన్నీ ప్రారంభిస్తాం అన్నారు. సీఎం కెసిఆర్ గారు వచ్చాకే తెలంగాణ రాష్ట్రం లో పురాతన దేవాలయాలకి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. దీనికి సజీవ సాక్ష్యం మన యాదాద్రి, పాలకుర్తి, బ‌మ్మెర‌, వ‌ల్మీడి ఆలయాలే నని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలంతా… తెలంగాణ రాకముందు, వచ్చిన తరువాత అభివృద్ధిలో వచ్చిన మార్పులను బేరీజు వేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. అభివృద్ది ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుళ్లుతో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని వాటికి ప్రజలు గమనించి సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలే నా బలం, బలగం అని కష్ట సుఖాల్లో మీకు అందరికీ నేను అండగా ఉంటాను అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు, పథకాలు దేశానికి ఆదర్శం కావడంతో అన్ని రాష్ట్రాలు మన వైపే చూస్తున్నాయని అన్నారు. మనమంతా మరోసారి సీఎం కెసిఆర్ గారిని ఆశీర్వదించి, BRS పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడానికి కంకణ బద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు.

సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు – డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
ఈ కార్య‌క్ర‌మానికి డిసిసిబి చైర్మ‌న్ మార్నేని ర‌వింద‌ర్ రావు హాజ‌ర‌య్యారు. సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీల‌తోపాటు, ఇవ్వ‌ని హామీల‌ను కూడా నెర‌వేర్చారు. ఉద్య‌మ నేతే, సీఎం కావ‌డంతో రాష్ట్రానికి, అభివృద్ధికి క‌లిసి వ‌చ్చింది. అన్నారు. మంత్రి ఎర్ర‌బెల్లి హ‌యాంలో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధి మ‌రెక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు.

ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తి మంత్రి ఎర్రబెల్లి – ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ చైర్మ‌న్ ఉషా ద‌యాక‌ర్ రావు
ఈ స‌మ్మేళ‌నంలో ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ చైర్మ‌న్ ఉషా ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, చ‌దువు సంస్కారానికి ఉప‌యోగ‌ప‌డ‌త‌ది. కొంద‌రు ద‌యాక‌ర్ రావు చ‌దువుకోలేద‌ని విమ‌ర్శ చేయ‌డం వారి అజ్ఞానికి నిద‌ర్శ‌నం. కానీ, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల మ‌నోభావాలు చ‌దివారు. ఏడు సార్లు గెలిచారు. రాష్ట్ర అభివృద్ధిలో కెసిఆర్ కు చేదోడుగా ఉంటున్నాడు. అని అన్నారు. కొంద‌రి బుద్ధిలేని వారి మాట‌ల‌ను న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేర‌ని ఆమె తెలిపారు.

జ‌నంతో మంత్రి ఎర్ర‌బెల్లి మ‌మేకం
స‌మ్మేళ‌నానికి ముందు సీఎం సందేశాన్ని చ‌దివి వినిపించారు. మంత్రి ప‌లువురు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, వివిధ కుల వృత్తుల వారితో ఫోటోలు దిగారు. అంత‌కుముందు మంత్రి ఎర్ర‌బెల్లికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. పాల‌కుర్తి పార్టీ ఆఫీసు నుంచి బృందావ‌న్ గార్డెన్ వ‌ర‌కు కి.మీ. వ‌ర‌కు మంత్రి న‌డుచుకుంటూ వెళ్ళ‌గా, మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ‌లు, డ‌ప్పు చ‌ప్పుళ్ళు, కోలాటాలతో, పూలు చ‌ల్లుతూ ఘ‌నంగా తోడ్కొని వెళ్ళారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎడ్ల బండి ఎక్కారు. త‌ల‌కు పాగా చుట్టి, ఎడ్ల‌ను గ‌ద‌మాయిస్తూ, రైతు అవ‌తార‌మెత్తారు. అలాగ‌, ద్విచ‌క్ర‌వాహ‌నంపై కొద్ది దూరం ప్ర‌యాణించారు. గొంగ‌డి భుజానికేసుకుని గొల్ల కురుమ అవ‌తార‌మెత్తారు. అలాగే కొద్దిసేపు గొల్ల‌ల డోలు వాయించారు. ఇలా ప్ర‌జ‌ల్లో మ‌మేకం అవుతూ మంత్రి ఆయా కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల్లో జోష్ ని నింపారు. అలాగే ఆత్మీయ సమ్మేళనాలలో పార్టీ కార్యకర్తలకు స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనాలు చేశారు.

పోచ‌మ్మ దేవాల‌య అభివృద్ధికి శంకుస్థాప‌న‌
అంతకముందు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల పోచమ్మ దేవాలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. ఓ దాత ఇచ్చిన విరాళానికి తోడు త‌న వంతుగా ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు మంత్రి హామీ ఇచ్చారు.

వైకుంఠ ధామానికి ప్రారంభోత్స‌వం
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గ్రామ పంచాయితీ నిధులతో ఏర్పాటు చేసిన వైకుంఠధామం ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వైకుంఠ ధామాన్ని మంత్రి ప‌రిశీలించారు.

అభివృద్ధి ప‌నుల‌ను ఆగ‌ష్టు 25లోగా పూర్తి చేయాలి

ప‌నుల ప్ర‌గ‌తిపై అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి స‌మీక్ష‌

మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నులు, దేవాల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నుల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి పాల‌కుర్తిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆయా అభివృద్ధి ప‌నులు నిర్ణీత గ‌డువులోగా పూర్తి కావాల‌ని ఆదేశించారు. ఆగ‌ష్టు 25లోగా పూర్తి చేయాల‌ని, పనుల నాణ్య‌త‌లో రాజీ ప‌డొద్ద‌ని సూచించారు. ఆయా ప‌నులు పూర్తి కావ‌డంతోపాటు వాటి ప్రారంభోత్స‌వాల‌కు కూడా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు, వివిధ సామాజిక వ‌ర్గాల ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News