Sunday, November 16, 2025
HomeతెలంగాణErrabelli: ఎర్రబెల్లికి థాంక్స్ చెప్పిన తండా వాసులు

Errabelli: ఎర్రబెల్లికి థాంక్స్ చెప్పిన తండా వాసులు

అడిగిన వెంటనే గ్రామ సమస్యలు తీర్చిన దయన్నకు థాంక్స్ అంటున్న తండా ప్రజలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు పునుసోత్ తండా వాసులు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం లక్ష్మక్క పల్లె పునుసోత్ తండాలో అడిగిన వెంటనే 20 డబుల్ బెడ్ రూం ఇండ్లు, గ్రామానికి దుర్గమ్మ గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసిన గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో ఎర్రబెల్లిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఆ గ్రామ ప్రతినిధులు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్నారని, ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. మంత్రిని కలిసిన వారిలో పునుసోత్ తండా బాలు నాయక్, వీరన్న, మురళి, సుందర్, సంపత్, దయ్యాల సైదులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad